తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో నటుడు విజయ్ దేవరకొండకి ‘కాంతారావు స్మారక పురస్కారం’ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఈ అవార్డు ప్రకటించడంపై విజయ్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలియజేస్తూ విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో నాకు కాంతారావు స్మారక పురస్కారం రావడం నిజంగా చాలా గౌరవంగా ఉంది. నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు రావడం చాలా గొప్పగా నేను భావిస్తాను. తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. అలాగే, 2016లో వచ్చిన పెళ్లిచూపులు సినిమాకి 2వ ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం కూడా సంతోషంగా ఉంది. పెళ్లిచూపులు ఎప్పటికీ నా గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. నా అభిమానులందరికీ, ఇది మీకోసమే. మీ ప్రేమ నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది. నా కుటుంబ సభ్యులకి, డైరెక్టర్స్‌కి, నా టీమ్‌కి.. ఈ ప్రయాణంలో నాతో ఉన్నందుకు ధన్యవాదాలు.
- May 30, 2025
0
180
Less than a minute
Tags:
You can share this post!
editor

