బాల‌య్య సినిమాలోని ఒక్క సీన్‌ని రూ.4.5 కోట్లు పెట్టి కొన్న విజ‌య్

బాల‌య్య సినిమాలోని ఒక్క సీన్‌ని రూ.4.5 కోట్లు పెట్టి కొన్న విజ‌య్

ఇల‌య‌ ద‌ళ‌ప‌తి విజ‌య్ త్వ‌ర‌లో సినిమాల‌కి స్వ‌స్తి చెప్ప‌నున్నారు. పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన క్ర‌మంలో విజ‌య్ చివ‌రిగా కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై హెచ్. వినోద్ దర్శకత్వంలో ‘జననాయగన్’ పేరుతో సినిమా చేస్తున్నారు. విజ‌య్ చివ‌రి సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు బాగా ఉన్నాయి. ఈ సినిమా బాల‌య్య న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్ అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. కాని ఈ సినిమా బాల‌య్య సినిమాకి రీమేక్ కాద‌నే టాక్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.. భ‌గ‌వంత్ కేసరి సినిమాలోని ఒక సీన్‌ని మాత్రమే జననాయగన్‌లో వాడుకున్నారని సమాచారం. ఆ సీన్ కోసమే ఆ సినిమా మొత్తం రీమేక్ హక్కుల్ని 4.5 కోట్ల రూపాయలకి జననాయగన్ టీం కొనుక్కుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. భగవంత్ కేసరి సినిమాలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే సీన్ చాలా హైలైట్ కాగా, అది మంచి ఎమోషన్‌ని పండించింది. కేవలం ఆ సీన్‌ని మాత్రమే రీమేక్ చేయడానికి భగవంత్ కేసరి రైట్స్ మొత్తం కొనుక్కున్నారని తెలుస్తోంది.

editor

Related Articles