తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా సినిమా మార్గన్. ఈ సినిమాకు లియో జాన్‌పాల్ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మిస్తోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందినట్లు తెలుస్తోంది. ఒక సైకో స్విమ్మర్ అమ్మాయిలకు ఒక వింత డ్రగ్‌ను ఇచ్చి హత్య చేస్తుంటాడు. ఈ డ్రగ్ ప్రభావం వల్ల వారి శరీరాలు నల్లగా మారి ప్రాణాలు కోల్పోతారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారి పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. దర్యాప్తులో భాగంగా అతను కూడా ఈ డ్రగ్ బారిన పడి, అతని శరీరంలో సగ భాగం నల్లగా మారడం ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచింది. ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి, హంతకుడిని విజయ్ ఆంటోనీ ఎలా పట్టుకుంటాడనేది సినిమా ప్రధాన కథాంశం. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ విలన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
- May 27, 2025
0
122
Less than a minute
Tags:
You can share this post!
editor

