‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నటుడు విక్టరీ వెంకటేష్ చాలారోజుల తర్వాత తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్‌ని ఇచ్చారు. తన తదుపరి సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇండిపెండెన్స్ డే కానుకగా.. ఈ ప్రాజెక్ట్ నేడు పూజా కార్యక్రామాలు పూర్తి చేసుకుంది. వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే షూటింగ్‌ను మొదలుపెట్టబోతుండగా ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

- August 15, 2025
0
63
Less than a minute
Tags:
You can share this post!
editor