బాల‌య్య‌తో వెంక‌టేష్.. ప్రోమో రిలీజ్‌

బాల‌య్య‌తో వెంక‌టేష్.. ప్రోమో రిలీజ్‌

బాల‌కృష్ణ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సూప‌ర్ హిట్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’. ఇప్ప‌టికే మూడు సీజ‌న్‌లు విజ‌య‌వంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో నాలుగో సీజ‌న్‌లోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. నాలుగో సీజ‌న్‌లో ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, అల్లు అర్జున్‌, త‌మిళ న‌టుడు సూర్య‌ల‌తో పాటు న‌వీన్ పొలిశెట్టి త‌దిత‌రులు వ‌చ్చి సంద‌డి చేశారు. ఇప్పుడు తాజాగా ఈ షోకి వెంకీ మామ రాబోతున్నాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. వెంక‌టేష్ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోకి వ‌చ్చి సంద‌డి చేశారు. వెంక‌టేష్‌తో పాటు అన్న సురేష్ బాబు, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కూడా వ‌చ్చి అల్లరి చేశారు.

editor

Related Articles