మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది. తాజాగా విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం నా భాగం పూర్తయ్యింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం! నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశాన్ని ఈ ప్రత్యేకమైన సినిమాతో ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం అందరం కలిసి 2026 సంక్రాంతిని థియేటర్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేద్దాం. విక్టరీ వెంకటేష్ పోస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి రిప్లయ్ ఇస్తూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు. మై డియర్ వెంకీ… మై బ్రదర్.. మనిద్దరం కలిసి పనిచేసిన ఈ పది రోజులు నాకు మెమరబుల్. నీతో గడిపిన ప్రతి క్షణం ఆనందంతో, ఎనర్జీతో నిండిపోయింది.
- December 4, 2025
0
33
Less than a minute
You can share this post!
editor


