‘రాధేశ్యామ్’ డైరెక్టర్‌తో వ‌రుణ్ తేజ్ కొత్త సినిమా.?

‘రాధేశ్యామ్’ డైరెక్టర్‌తో వ‌రుణ్ తేజ్ కొత్త సినిమా.?

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హర్రర్ – కామెడీ సినిమాలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. ‘కొరియన్ కనకరాజు’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ మరో ఆసక్తికరమైన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. టాలీవుడ్ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘రాధే శ్యామ్’ విడుదల తర్వాత రాధాకృష్ణ తన తదుపరి సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్‌కు ఆయన ఒక అందమైన ప్రేమకథను వినిపించారని సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ కథ వరుణ్ తేజ్‌ను ఎంతగానో ఆకట్టుకుందని సమాచారం. ప్రస్తుతానికి ఇది కేవలం ఊహాగానం మాత్రమే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అధికారికంగా తెలియాల్సి ఉంది.

editor

Related Articles