టాలీవుడ్ హీరో రామ్‌చరణ్, కోడలు ఉపాసన మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఉపాసన తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసి వెల్లడించింది. దీపావళి వేడుకలతో పాటు ఉపాసన సీమంతం కూడా జరిపినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వీడియోకు పెట్టిన క్యాప్షన్‌లో “డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్ అండ్ డబుల్ బ్లెస్సింగ్స్” అని ఉపాసన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ సభ్యులు, బంధువులు హాజరై పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు సెలబ్రిటీలు, మెగా ఫ్యాన్స్ రామ్‌చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఉపాసన ఈ సారి కవలలకి జన్మనివ్వబోతున్నట్టు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. క్లింకారకి తోడుగా మరో ఇద్దరు రాబోతున్నారట. ఈ విషయాన్ని మెగా కుటుంబ సన్నిహితులు లీక్ చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వారు అన్నారు.
- October 24, 2025
0
4
Less than a minute
You can share this post!
editor

