ఉపాసన- రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారా సహా సెప్టెంబర్ లో ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒమన్, ఆఫ్రికా, ఇటలీ మరియు మెల్‌బోర్న్‌తో సహా అనేక అద్భుతమైన ప్రదేశాలకు సందర్శించారు. తాజాగా ఉపాసన తన ఐస్‌లాండ్ ట్రిప్‌ను సడేన్‌గా రద్దు చేసుకున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఐస్‌లాండ్ లో హాని కలిగించే ఫిన్ వేల్స్ సహా రెండు వేలు పైగా తిమింగలాలను చంపడానికి ప్రభుత్వం అనుమతించింది. ఆ మేరకు వేటగాళ్లకు లైసెన్సులను ప్రభుత్వం పునరుద్ధరించనుంది. దీంతో ఐస్ ల్యాండ్‌కు తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
సముద్ర జీవాలు, మత్స్యసంపదపై మనిషి ఆధారపడటం పర్యావరణ హానిగా మారింది. గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రమాదాలకు ఇదో కారణం. తిమింగళాలు వాతావరణంలోని కార్బన్‌డై ఆక్సైడ్‌ని సంగ్రహించి ఆక్సిజన్ పెరగడానికి సహకరిస్తాయి. అలాంటి సముద్ర జీవాలను రక్షించాల్సిన బాధ్యత మనందరిది. అందుకే వీటి సంహారానికి జారీ చేసే లైసెన్సులను రద్దు చేయాలని చాలా కాలంగా ప్రపంచ దేశాల్లో చర్చ సాగుతోంది. రెండు వేలు పైగా తిమింగలాలను చంపడానికి ప్రభుత్వం అనుమతించడంపై తన బాధను వ్యక్తం చేశారామె.
ఇలాంటి ఒక మంచి పనికోసం ఐస్ ల్యాండ్ పర్యటనను రద్దు చేసుకున్నందుకు, ఉపాసన నిర్ణయానికి అందరూ మద్దతు తెలుపుతున్నారు.