త్రివిక్రమ్:  పవన్ కోసం రెండు సినిమాలు రెడీ చేసే పనిలో..?

త్రివిక్రమ్:  పవన్ కోసం రెండు సినిమాలు రెడీ చేసే పనిలో..?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజి ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాల తరువాత పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో పాల్గొంటారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కోసం మరో రెండు సినిమాలను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ‘బ్రో’ సినిమాకు ఆయన పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా అలాంటి పాత్రనే పోషించబోతున్నట్లుగా వార్తలు అందుతున్నాయి. పవన్‌కు సూట్ అయ్యే రెండు కథలను ముందు త్రివిక్రమ్ విన్నాక, అవి పవన్‌కు వినిపించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ రెండు కథలను పవన్ విని ఓకే అన్నాకే నిర్మాతలు ఎవరనే విషయం తేలనుందట. మరి రాజకీయాల్లో బిజీగా ఉంటూ, పవన్ మరో రెండు సినిమాలకు ఓకే చెబుతాడా లేదా అనేది వెయిట్ అండ్ సీ.

administrator

Related Articles