ఒకప్పటి పాపులర్ నటి పూనమ్ కౌర్ ఇటీవల వివాదాలతో వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఉంటుంది. గతంలో త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్ చేయగా, ఇప్పుడు దానిపై మరోసారి స్పందించి వార్తలలో నిలిచింది. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. మెయిల్ ద్వారా కంప్లైంట్ చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను, కాని తర్వాత ఆమెని కలవలేకపోయాను. ఆమె బిజీగా ఉన్నారని, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. అందుకే కలవలేకపోయాను. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కంప్లైంట్ చేశాను. రాజకీయ అండదండలతో ఎవరైతే తప్పించుకుంటున్నారో అతడి మీద ఫిర్యాదు చేశాను.. మెయిల్ చేసినట్టుగానే ఉమెన్ టీంతో నేను మాట్లాడతాను.. థాంక్యూ అని పూనమ్ పోస్ట్ వేసింది.
- May 21, 2025
0
61
Less than a minute
Tags:
You can share this post!
editor

