త్రిష నవ్వుకు దాసోహమవ్వాల్సిందే..

త్రిష నవ్వుకు దాసోహమవ్వాల్సిందే..

తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఇండియాలోనే వన్‌ ఆఫ్ ది టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది త్రిష.  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ప్రస్తుతం థగ్‌ లైఫ్‌ సినిమాలో నటిస్తోందని తెలిసిందే. నాలుగు పదుల వయస్సు దాటినా రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో వన్నె తరగని అందంతో కుర్రకారు మతులు పోగొడుతోంది త్రిష. జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. థగ్‌ లైఫ్‌ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో త్రిష సూపర్ స్లిమ్‌గా కనిపిస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ఫ్లోరల్‌ డిజైన్‌డ్‌ ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో స్టేజీపై చిరునవ్వులు చిందిస్తూ అందరి మనసులను కొల్లగొట్టేస్తోంది. త్రిష స్టిల్స్‌, వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

editor

Related Articles