కార్మికుల సమ్మె కారణంగా గత రెండు వారాలుగా సినిమా షూటింగులు నిలిచిపోయిన సంగతి మీకు తెలిసిందే. తాజా పరిణామాలపై హీరో చిరంజీవితో చిన్న నిర్మాతలు భేటీ అయ్యారు. సమ్మె కారణంగా చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చిరంజీవికి విన్నవించారు. చిరంజీవి జోక్యంతో పరిస్థితులు చక్కబడతాయని ఇరు వర్గాల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఎంప్లాయీస్ ఫెడరేషన్తో కూడా మాట్లాడతానని, సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తానని చిరంజీవి హామీ ఇచ్చినట్టు చిన్న నిర్మాతలు తెలిపారు. ఇదిలావుంటే.. ఆదివారం చిరంజీవితో నిర్మాత సి.కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, నిర్మాతలు.. వీరంతా కలిస్తేనే సినిమా అనీ, తానెప్పుడు సినీపరిశ్రమ బాగుండాలనే కోరుకుంటానని, సినిమాకు సంబంధించి నిర్మాతే కీలకమని, తన వంతుగా కార్మికులతో మాట్లాడతానని, ఇరువర్గాలకూ న్యాయం జరిగేలా చూస్తానని చిరంజీవి చెప్పినట్టు సి.కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంకా ఇలా మాట్లాడుతూ లేబర్ కమిషన్ రూల్స్ ప్రకారం పనిచేయడం మొదట్నుంచీ ఇక్కడ వారికి అలవాటు లేదు. ఓ కుటుంబంలా పనిచేయడం సినీఇండస్ట్రీకి అలవాటైపోయింది.

- August 18, 2025
0
24
Less than a minute
Tags:
You can share this post!
editor