విష్ణు విశాల్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘గట్టా కుస్తి’. ఈ సినిమా రెండో పార్ట్ తీయబోతున్నారు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభించారు. చెల్లా అయ్యావు దర్శకుడు. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, ఐశ్వర్యాలక్ష్మి జంటగా నటించగా, ఇతర పాత్రల్లో కాళి వెంకట్, మునిష్కాంత్, కరుణాస్ తదితరులు నటించారు. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్‌తోనే రెండో భాగం తీయబోతున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. ఈ రెండో భాగం ప్రోమోకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. నిజానికి ఫస్ట్ పార్ట్‌లోనే ఈ సినిమా స్టోరీ కంప్లీట్ అయింది. కానీ, దానికి కొనసాగింపుగా స్పోర్ట్స్ డ్రామా శైలిలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకున్న తర్వాత కుటుంబంలో జరిగే ప్రధాన సమస్యలతో హాస్యభరితంగా తెరకెక్కించనున్నారు. చెన్నై, పొల్లాచ్చి, పాలక్కాడ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ స్పాట్స్‌గా సెలెక్ట్ చేసి అక్కడనే సినిమా తీయబోతున్నారు.

- September 4, 2025
0
72
Less than a minute
You can share this post!
editor