తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పేరు ఎస్తేర్ నోరోన్హా. కన్నడ సినిమాలతో తెరంగేట్రం చేసిన ఈ హీరోయిన్, ‘వేయి అబద్ధాలు’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైంది. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన ఈ సినిమా ఎస్తేర్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’ లో నాని సరసన నటించిన ఎస్తేర్ క్రేజ్ మరింత పెరిగింది. ఇక ‘గరం’, ‘జయ జానికి నాయక’, ‘చాంగురే బంగారు రాజా’, ‘69 సంస్కార్ కాలనీ’, ‘డెవిల్ – బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ వంటి సినిమాల్లో నటించి, గ్లామర్ తో పాటు తన అభినయంతోను మెప్పించింది. ఎస్తేర్ సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా వార్తల్లో నిలిచింది. ప్రముఖ సింగర్ నోయెల్ సేన్ తో ప్రేమలో పడ్డ ఎస్తేర్, 2019లో అతన్ని పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల్లోనే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మరింత గ్లామరస్ పాత్రలు చేసి సందడి చేసింది. ముఖ్యంగా ‘రెక్కి’ సినిమాలో ఆమె శృంగార సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవలే నటిగా కాకుండా దర్శకురాలు, నిర్మాతగానూ మారిన ఎస్తేర్ బిజీ బిజీగా మారిపోయింది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. త్వరలో సర్ ప్రైజ్ తన నుండి రానుందని కామెంట్ పెట్టేసరికి అందరూ ఆమె రెండో పెళ్లి చేసుకోబో తోందా అంటూ ఆలోచనలో పడ్డారు.

- September 13, 2025
0
2
Less than a minute
You can share this post!
editor