భారత సినిమా పరిశ్రమలో విలక్షణమైన హాస్యాన్ని, సున్నితమైన కథనాలను తెరపై ఆవిష్కరించిన ప్రఖ్యాత దర్శకుడు ప్రియదర్శన్ తన డైరెక్షన్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 41 ఏళ్ల సినిమాటిక్ ప్రయాణం తర్వాత తన 100వ సినిమాతో దర్శకత్వం నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపారు. మలయాళంలో రచయితగా, దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రియదర్శన్, హిందీ సినిమాలలో ‘హేరా ఫేరీ’, ‘భూల్ భులయ్యా’, ‘హంగామా’ వంటి అద్భుత హాస్య చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. తెలుగులోనూ అక్కినేని నాగార్జునతో ‘నిర్ణయం’, బాలకృష్ణతో ‘గాంఢీవం’ సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం అక్షయ్‌కుమార్, పరేష్ రావల్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘హేరా ఫేరీ 3’ సినిమాను ప్రియదర్శన్ డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే, అక్షయ్ కుమార్‌తో కలిసి ఆయన ‘ఒప్పం’ హిందీ రీమేక్ ‘హైవాన్’ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత, తన 100వ సినిమాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి ఒక సినిమా చేయనున్నట్టు చెప్పారు. “మొదటి సినిమా నుండి ఇప్పటివరకు 41 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. డైరెక్షన్ పరంగా నేను పూర్తిగా అలసిపోయాను. నా 100వ సినిమాతో ఈ ప్రయాణానికి ముగింపు పలికే సమయం వచ్చింది” అని ప్రియదర్శన్ ప్రకటించారు.
- August 25, 2025
0
103
Less than a minute
You can share this post!
editor

