బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ గ్యాంగ్ నుండి మరో నటుడికి ఇలాంటి బెదిరింపులే రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. సల్మాన్‌ను చంపేస్తామంటూ వరుస బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ గ్యాంగ్ నుండి మరో నటుడికి ఇలాంటి బెదిరింపులే రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి తనకు హత్య బెదిరింపులు వచ్చినట్లు బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లా తాజాగా తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి వివరాలను కూడా శుక్లా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వచ్చిన బెదిరింపు సందేశాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో ‘నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిని. నాకు మీ ఇంటి అడ్రెస్ తెలుసు. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లే మీ ఇంటిపై కూడా జరుపుతాం. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. అసిమ్ గురించి గౌరవంగా మాట్లాడండి. లేదంటే బిష్ణోయ్ గ్యాంగ్ లిస్ట్‌లో మీ పేరు చేరుతుంది’ అని ఉంది. ఆ పోస్ట్‌ను పంజాబ్, చండీగఢ్ పోలీసులకు శుక్లా ట్యాగ్ చేశారు. అతడి నుండి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, అభినవ్ శుక్లా భార్య రుబీనాకు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అసిమ్ రియాజ్‌కు మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసిమ్‌పై అభినవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అసిమ్ అభిమానులు ఈ హీరోకు బెదిరింపులు పంపుతున్నారు. తాజాగా వచ్చిన సందేశం కూడా అతడి అభిమానులే పంపినట్లు అభినవ్ ఆరోపించారు.
- April 21, 2025
0
78
Less than a minute
Tags:
You can share this post!
editor

