Movie Muzz

దేశం గురించి ఆలోచించే వాళ్లు చైనా గూడ్స్ కొనవద్దు: రేణూ దేశాయ్

దేశం గురించి ఆలోచించే వాళ్లు చైనా గూడ్స్ కొనవద్దు: రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ టాలీవుడ్‌లో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌‌ని పెళ్లి చేసుకుంది. వారు ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ కలిసి మొదట `బద్రి` సినిమాలో నటించారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతోనే సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్‌. ఆ త‌ర్వాత ఒక‌టి రెండు సినిమాలు చేసి గుడ్ బై చెప్పింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ ఎప్పుడూ కూడా స‌మాజంపై చాలా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. స‌మాజంలో కొంద‌రు చేసే త‌ప్పుడు ప‌నులు త‌న దృష్టికి వస్తే వెంట‌నే నిలదీసి క‌డిగి ప‌డేస్తుంది. అయితే ఇటీవ‌ల కశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తదనంతర పరిణామాలు అందరికీ తెలిసినవే. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో మన బలగాలు దాడి చేయడం.. తర్వాత ఇండియా-పాకిస్థాన్ మధ్య మూడు రోజుల పాటు యుద్ధ వాతావరణం నెలకొన‌డం మ‌నం చూశాం. దేశం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలంటూ కోరారు. నేను ఇప్ప‌టివ‌ర‌కు చైనాలో త‌యారు చేసిన చాలా వ‌స్తువుల‌ని కొనుగోలు చేశాను. ఇక నుండి ప్ర‌తి లేబుల్ చెక్ చేసి చైనా వ‌స్తువుని నిషేధిస్తాను. ఇది చాలా పెద్ద పనే అయినా కూడా ఎక్క‌డో ఒక చోట మొద‌లు కావాలి. మ‌నం కొనే ప్ర‌తి వ‌స్తువు ఎక్క‌డ త‌యార‌వుతుందో లేబుల్‌ని క‌చ్చితంగా చ‌దివి ఆ త‌ర్వాత తీసుకోండి. మన దేశానికి మద్దతు పలకండి.. జై హింద్ అంటూ రేణూ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చారు.

editor

Related Articles