ఇప్పుడు ఊహించని విధంగా ప్లాన్ చేసుకొని సమ్మర్ బాక్సాఫీస్ వార్ సిద్ధం అయ్యింది. సమ్మర్ ముగింపు అలాగే వానా కాలం మొదలయ్యే సమయంలో ఒక నెల వ్యవధిలో మొత్తం 5 భారీ సినిమాలు తెలుగు సహా పాన్ ఇండియా ఆడియెన్స్‌ని అలరించేందుకు వచ్చేస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనే చూసుకున్నట్టైతే కమల్ హాసన్, మణిరత్నంల సినిమా “థగ్ లైఫ్” కూడా ఒకటి. ఈ సినిమా జూన్ 5న విడుదల అవుతుంది. ఇక అదే నెల తర్వాతి వారం లోనే హీరో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” జూన్ 12న విడుదల కానున్నట్టుగా లేటెస్ట్ గానే అనౌన్స్ చేశారు. ఇక వీటితో పాటుగా జూన్ 20న ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల సినిమా “కుబేర” సిద్ధంగా ఉంది. ఇక ఈ వారం తర్వాత మంచు విష్ణు సినిమా “కన్నప్ప” జూన్ 20న రాబోతుండగా ఫైనల్‌గా జూలై 4న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా “కింగ్‌డమ్” రాబోతోంది. ఇలా పలు ఊహించని మార్పులు చేర్పులతో సమ్మర్ ట్రీట్ ఆడియెన్స్ కోసం సిద్ధంగా ఉందని చెప్పాలి.
- May 17, 2025
0
142
Less than a minute
Tags:
You can share this post!
editor


