ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ సినిమాల్లో తన మాస్‌ని మ్యాచ్ చేసే దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొనగా ఈ షూటింగ్ కూడా ఇపుడు ప్లాన్డ్ గా కొనసాగుతోంది. ఈ సినిమా నుండి రానున్న మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా స్పెషల్ గ్లింప్స్ ఉండొచ్చు అని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ట్రీట్ ఉండకపోవచ్చట. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే ఆరోజు రివీల్ చేసే ఛాన్స్ ఉందట. ఎందుకంటే ఆల్‌రెడీ వార్ 2 నుండి టీజర్ కన్ఫర్మ్ కావడంతో ఆ రోజున నీల్ ప్రాజెక్ట్ నుండి పోస్టర్ మాత్రమే వస్తుంది అని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ప్రస్తుతం అయితే తారక్ అభిమానులు ఆ బిగ్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- May 17, 2025
0
149
Less than a minute
Tags:
You can share this post!
editor

