“రామ్‌చరణ్ 16”వ సినిమాపై వచ్చిన రూమర్స్‌లో నిజం లేదు

“రామ్‌చరణ్ 16”వ సినిమాపై వచ్చిన రూమర్స్‌లో నిజం లేదు

రామ్‌చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ ఛేంజర్ తర్వాత తన కెరీర్‌లో వచ్చే 16వ సినిమా గురించి అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో చేస్తున్న ఈ సినిమా పట్ల భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా దూసుకుపోతోంది, తాజాగా ఓ రూమర్ ఈ సినిమాలో చరణ్ పాత్రపై స్ప్రెడ్ అవుతోంది. దీంతో రామ్‌చరణ్ ఈ సినిమాలో ఒక గుడ్డివాడుగా కనిపిస్తాడని, ఆ మాట వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్‌కి మరో వైకల్యం ఉంటుంది కానీ కళ్ళు కనిపించని పాత్రలో మాత్రం తాను చేయడం లేదట. సో ఆ రూమర్స్‌లో నిజం లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles