సామాన్యుడు విజేతగా నిలిచే కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు పుష్ప, లక్కీ భాస్కర్ వంటి సినిమాలే నిదర్శనం అన్నారు హీరో ప్రియదర్శి. ఇటీవలే ‘కోర్ట్’తో సూపర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన ‘సారంగపాణి జాతకం’ సినిమాతో మరలా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రియదర్శి విలేకరులతో పంచుకున్న సంగతులు.. జాతకాలను నమ్మాలా? లేదా? అనే విషయాలను ఈ సినిమాలో చర్చించడం లేదు. కానీ ఒకరి నమ్మకాల్ని మరొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తున్నాం. జాతకాలను నేను కొంతవరకు నమ్ముతాను. కానీ వాటి గురించి పెద్దగా ఆలోచించను. ఇండస్ట్రీలో ఏదీ మన చేతిలో ఉండదు. ప్రయత్నం చేయడం వరకే మన పని. ప్రేక్షకులను నవ్వించడం చాలా కష్టమైన విషయం. ఇంద్రగంటి మోహనకృష్ణ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇందులో నా పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఇప్పటివరకు నేను ఎక్కువగా తెలంగాణ మాండలికంలోనే మాట్లాడాను. కానీ ఈ సినిమాలో ఆంధ్ర యాసలో మాట్లాడతాను. నా కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ వైవిధ్యంగా ఉంటాయి. కామన్‌మేన్ పాత్రల్ని నేను బాగా ఇష్టపడతాను. నా సినిమాల సక్సెస్‌కు అదీ ఒక కారణంగా భావిస్తాను.
- April 23, 2025
0
84
Less than a minute
Tags:
You can share this post!
editor

