తమిళ హీరో విశాల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడనున్నాడు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వారిద్దరూ పెళ్లి తేదీని ప్రకటించినట్లు సమాచారం. విశాల్, ధన్సిక ఇద్దరు 15 ఏళ్లుగా ఫ్రెండ్స్ కాగా.. ఈ ఏడాదిలోనే ఏడడుగుల బంధంతో ఒకటి కాబోతున్నారు. గత కొద్దిరోజులుగా విశాల్ పెళ్లి వార్తలు వైరల్‌గా మారాయి. గతంలో పలువురు హీరోయిన్లతో పెళ్లి జరుగనున్నట్లు వార్తలు వచ్చినా అందులో ఏమాత్రం నిజం లేదని తేలింది. తాజాగా ధన్సికను విశాల్ పెళ్లి చేసుకోనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు పెళ్లి వార్తలను ధ్రువీకరించినట్లు సమాచారం. ఆగస్టు 29న ఇద్దరు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. విశాల్ బర్త్‌డే కూడా అదేరోజు కావడం విశేషం.
- May 20, 2025
0
57
Less than a minute
Tags:
You can share this post!
editor

