కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ‘థగ్ లైఫ్’. మరి ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా కమల్, త్రిష, శింబు ఇంకా అనేకమంది నటులు భాగం కాగా ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్‌కి ఈ స్పెషల్ కాంబినేషన్ కోసం చూస్తున్న జనరల్ ఆడియెన్స్‌కి ఒక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన పాటలు, టీజర్స్‌తో సినిమా నేపథ్యం ఇతర అంశాలు గోప్యంగానే ఉన్నాయి. ఇవన్నీ ట్రైలర్ చూస్తే తప్ప ఒక క్లారిటీ వచ్చేలా లేదు. అందుకే ఈ ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్‌గా ఈ ట్రైలర్ రిలీజ్‌కి టైం లాక్ అయ్యింది. ఈరోజు మే 17 సాయంత్రం 5 గంటలకి ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని భాషల్లో కూడా ఇదే సమయానికి ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాకి ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రాజ్ కమల్ ఫిల్మ్స్ అలాగే మద్రాస్ టాకీస్ వారు నిర్మాణం వహించారు. జూన్ 5న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమౌతోంది.
- May 17, 2025
0
55
Less than a minute
Tags:
You can share this post!
editor

