కుబేర సినిమాలో ‘నాది నాది నాది నాదే ఈ లోకం..’ సాంగ్ హిట్

కుబేర సినిమాలో ‘నాది నాది నాది నాదే ఈ లోకం..’ సాంగ్ హిట్

సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ధనుష్‌, నాగార్జునల ‘కుబేర’ సినిమా ఒకటి. టాలీవుడ్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్‌ వేగవంతం చేశారు. రీసెంట్‌గా ఈ సినిమాకు చెందిన సెకండ్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర’ పేరుతో ఉన్న ఈ వీడియో ప్రేక్షకుల్ని కుబేర ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, సినిమాలోని కీలక పాత్రలనూ, అవి క్రియేట్‌ చేయబోయే తుఫాన్‌లనూ ఈ గ్లింప్స్‌ ప్రజెంట్‌ చేస్తుందని మేకర్స్‌ తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఈ గ్లింప్స్‌లో హైలెట్‌గా నిలిచింది. ‘నాది నాది నాది నాదే ఈ లోకం..’ అనే కోరస్‌ శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. నందకిషోర్‌ రచించిన ఈ పాటను ధనుష్‌, హేమచంద్ర వేదాల కలిసి ఆలపించారు. నాగార్జున ఇందులో ఉద్వేగపూరితమైన నటనతో ఆకట్టుకుంటారని, విలువలతో నడుచుకునే వ్యక్తిగా కనిపించినా, ఆయన పాత్రలో అంతులేని ఎన్నో ప్రశ్నలుంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఇక ధనుష్‌ ఇంటెన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని వారు తెలిపారు.

editor

Related Articles