కూలీ నుండి ‘చికిటు’ పాట రిలీజ్..

కూలీ నుండి ‘చికిటు’ పాట రిలీజ్..

సూప‌ర్‌స్టార్ రజనీకాంత్‌  ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ సినిమాలో అమీర్‌ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌, స‌త్య‌రాజ్‌, సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా సినిమా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా.. మొదటి పాట ‘చికిటు’  పాట‌ను విడుద‌ల చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటలో రజనీకాంత్‌తో పాటు అనిరుధ్, టి. రాజేందర్ కూడా డ్యాన్స్‌తో అల‌రించారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాట తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

editor

Related Articles