డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ది రాజా సాబ్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఒక మేజర్ అప్ డేట్ రెండు వారాల్లో వస్తుందని దర్శకుడు మారుతి రీసెంట్ గానే తెలిపిన సంగతి తెలిసిందే. ఆ అప్‌డేట్ ఏమిటో తెలుసుకోడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో, ఈ సినిమా డిసెంబర్ 5న, 2025న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని పుకార్లు వ్యాపించాయి. అయితే, ఈ వార్తపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా టీజర్ మాత్రం త్వరలో విడుదల కానుంది. టీజర్ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వొచ్చు. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

- May 26, 2025
0
73
Less than a minute
Tags:
You can share this post!
editor