పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “ది రాజా సాబ్” గురించి అందరికీ తెలిసిందే. అయితే హ్యారీ పోటర్ రేంజ్‌లో హెవీ గ్రాఫిక్ వర్క్స్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి టీజర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా టీజర్‌పై పలు రూమర్స్ ఈ మధ్య కొనసాగుతున్నాయి. ఇక ఫైనల్‌గా ఇందుకు డేట్ లాక్ అయినట్టుగా లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. దీని ప్రకారం రాజా సాబ్ టీజర్‌ని మేకర్స్ ఈ జూన్ 16న విడుదల చేస్తున్నట్టుగా సమాచారం. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఒకటి ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్‌తో ఒక రొమాంటిక్ హర్రర్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
- June 3, 2025
0
55
Less than a minute
Tags:
You can share this post!
editor

