డైరెక్టర్ మారుతి హీరో ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ అనే భారీ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమ్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం అంటూ సాగిన ఈ టీజర్ వండర్‌ఫుల్‌గా వచ్చింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. హీరోయిన్స్‌తో లవ్ మూమెంట్స్‌తో పాటు సంజయ్‌దత్ రోల్ కూడా అదిరిపోయింది. ఇక విజువల్స్‌తో పాటు ప్రభాస్ లుక్ అండ్ ఎలివేషన్ షాట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్స్‌ను రివీల్ చేసిన షాట్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్‌లో మ్యూజిక్ అండ్ టేకింగ్, గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి ఈ టీజర్ చాలా బాగా ఆకట్టుకుంటోంది. కాగా టీజర్‌ను బట్టి, ఈ సినిమాలోని విజువల్స్ వండర్‌ఫుల్‌గా ఉంటాయని, ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే యాక్షన్ విజువల్స్ మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయని అర్ధం అవుతోంది. మొత్తంగా చూస్తే మారుతి ఈ సినిమా కోసం అద్భుతమైన ఎలిమెంట్స్‌ను సిద్ధం చేశాడు. పైగా ప్రభాస్‌కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందట. అన్నట్టు ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
- June 16, 2025
0
123
Less than a minute
Tags:
You can share this post!
editor

