హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి చేతులు కలుపుతున్నాడు. గతంలో ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ఈ కాంబినేషన్, ఈసారి ‘ది ప్యారడైజ్’ అనే సినిమాతో మన ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. అయితే, ఈ సినిమా షూటింగ్ విషయంలో కొంత ఆలస్యం జరుగుతుండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ మరోసారి ఆలోచిస్తున్నారట. గతంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను 2026 మార్చి 26 అంటూ ప్రకటించారు. కానీ, ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా సినిమాలు రిలీజ్‌కు ఉండటం.. హీరో రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా అప్పుడే రిలీజ్ అవుతుండటంతో.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మార్చిలో కాకుండా తమ సినిమాను వేసవి కానుకగా మే 15న తీసుకొచ్చేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నారట. త్వరలోనే ఈ విషయంపై వారు ఓ క్లారిటీ కూడా ఇస్తారని సినీ సర్కిల్స్ టాక్. ఇక ఈ సినిమాలో నాని నెవర్ బిఫోర్ లుక్‌లో మనకు కనిపిస్తాడు.
- June 17, 2025
0
84
Less than a minute
Tags:
You can share this post!
editor

