అంతుచిక్కని ఓ రహస్యమే ‘శంబాల’ సినిమా

అంతుచిక్కని ఓ రహస్యమే ‘శంబాల’ సినిమా

ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’. ‘ఏ మిస్టికల్‌ వరల్డ్‌’ ఉపశీర్షిక. యుగంధర్‌ ముని దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. శనివారం టీజర్‌ను విడుదల చేశారు. ‘ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలెన్నో ఉన్నాయి. సమాధానం దొరకనప్పుడు సైన్స్‌ దాన్ని మూఢ నమ్మకం అంటుంది. దొరికితే అదే తన గొప్పదనం అంటుంది’ అనే సంభాషణతో మొదలైన టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. విజువల్స్‌, బీజీఎమ్‌ హైలెట్‌గా నిలిచాయి. అంతరిక్షం నుండి అతీంద్రియ శక్తి కలిగిన ఓ ఉల్క గ్రామంలో పడటం, జనాలు చనిపోవడం, కొందరు వింతగా ప్రవర్తించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఉత్కంఠను పెంచింది. మిస్టిక్‌ థ్రిల్లర్‌ చిత్రమిదని, త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని మేకర్స్‌ పేర్కొన్నారు.

editor

Related Articles