దుల్కర్ నటించిన మరో మలయాళ సినిమా తాజాగా తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది. దుల్కర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఒరు యమండన్ ప్రేమకథ’. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను తాజాగా తెలుగులో తీసుకువచ్చింది భవాని మీడియా. ఆహా ఓటీటీ వేదికగా ఈ సినిమాను ‘ఒక యముడి ప్రేమకథ’ పేరుతో విడుదల చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా జాన్ అలియాస్ లల్లూ (దుల్కర్ సల్మాన్) అనే పెయింటర్ కథ. జాన్ ప్రేమ వివాహం చేసుకోవాలని కలలు కంటాడు. ఒకరోజు వార్తాపత్రికలో దియా (నిఖిలా విమల్) అనే అమ్మాయి ఫొటో చూసి, ఆమెను ఇష్టపడతాడు. తన స్నేహితులతో కలిసి ఎంత ప్రయత్నించినా దియా ఆచూకీ దొరకదు. అయితే కొంతకాలం తర్వాత, దియా హత్యకు గురైందని జాన్‌కు తెలుస్తుంది. దీంతో హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దియాను హత్య చేసిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
- June 5, 2025
0
170
Less than a minute
Tags:
You can share this post!
editor

