‘కింగ్‌డమ్’ సినిమా జూలై 4న రిలీజ్‌..

‘కింగ్‌డమ్’ సినిమా జూలై 4న రిలీజ్‌..

విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న భారీ సినిమా “కింగ్‌డమ్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఒకో అప్‌డేట్‌తో మరింత హైప్‌ని సెట్ చేసుకుంటుండగా మేకర్స్ ఈ మే 30న రిలీజ్‌కి సిద్ధం చేసుకున్నారు. కానీ ఈ సినిమా ఆ డేట్‌లో రాకపోవచ్చు అనే టాక్ కూడా వచ్చింది. మరి ఫైనల్‌గా ఈ రూమర్స్‌పై అఫీషియల్ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది. దీని ప్రకారం ఈ జూలై 4న గ్రాండ్‌గా రిలీజ్‌కి రాబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితులు రీత్యా ఆ డేట్‌కి వాయిదా వేస్తున్నామని లేదంటే మే 30నే విడుదల చేసేందుకు తాము స్టిక్ అయ్యి ఉన్నామని కానీ పరిస్థితులు ప్రభావం రీత్యా మార్చాల్సి వచ్చింది అని తెలిపారు. సో మొత్తానికి కింగ్‌డమ్ రాక తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ జూలై 4 నుండి థియేటర్లలో ప్రదర్శించబడుతుందని తెలిసింది. ఇక ఈ సినిమాకి అనిరుధ్  సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మించారు.

administrator

Related Articles