శ్లోక ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘బ్లాక్‌నైట్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. అక్షయ్, మదన్ జంటగా నటించిన ఈ సినిమాకి సతీష్ కుమార్ దర్శకత్వం వహించారు. సోమవారం సినిమా ట్రైలర్, పాటలను లాంచ్ చేశారు. యూత్‌ను మెప్పించే కథాంశమిదని, రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ జరిపామని దర్శకుడు సతీష్ కుమార్ తెలిపారు. నేటి యువతరం మనోభావాలకు అద్దం పట్టే వినూత్నమైన కథతో తెరకక్కించామని నిర్మాత వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. కథానుగుణంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుందని సంగీత దర్శకుడు విజయ్ బొల్లా తెలిపారు.
- July 1, 2025
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor

