‘అమరన్‌’ సినిమా ఒక ఆర్మీ మేజర్‌ ప్రయాణం..

‘అమరన్‌’ సినిమా ఒక ఆర్మీ మేజర్‌ ప్రయాణం..

శివకార్తికేయన్‌, సాయిపల్లవి కలిసి జంటగా నటిస్తున్న సినిమా ‘అమరన్‌’. రాజ్‌కుమార్‌ పెరియస్వామి డైరెక్టర్. కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ నిర్మాతలు. ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌’ అనే పుస్తకంలోని కంటెంట్ ఆధారంగా మేజర్‌ వరదరాజన్‌ సినిమాని తీశారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న రిలీజ్ కానుంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు.

అణువణువునా దేశభక్తిని మేళవించి తీసిన ఆర్మీ ఆఫీసర్‌ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ స్ఫూర్తిదాయక కథా జీవితాన్ని ఆధారంగా తీసుకుని చేసిన సినిమా, ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వరదరాజన్‌ భార్యగా సాయిపల్లవి నటించింది. దేశభక్తి, త్యాగం అనే అంశాల నేపథ్యంలో ట్రైలర్‌ ఆకట్టుకుంది. దేశ సేవలో మేజర్‌ వరదరాజన్‌ చేసిన త్యాగాలకు నివాళిగా ఈ సినిమాని తెరకెక్కించామని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

administrator

Related Articles