తెలంగాణ నేపథ్యంలో బలమైన కథతో సినిమా ఎలా తీయాలో అలా ఈ సినిమా తీశాను. నిర్మాతల సహకారంతో అనుకున్న విధంగానే సినిమాను తెరకెక్కించాం. అరిటాకులో వడ్డించిన విందు భోజనం తింటే ఎలా ఉంటుందో అలా ఈ సినిమా తీశామన్నారు రమేష్ చెప్పాల. ఆయన దర్శకత్వంలో సాయిరోనక్, ప్రగ్యా నాగ్ర జంటగా నటించిన ‘లగ్గం’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. ఇటీవల ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తండ్రీకూతుళ్ల కథ ఇది. దర్శకుడు రమేష్ చెప్పాలతో ‘మీ శ్రేయోభిలాషి’ సినిమా నుండి మా అనుబంధం సాగుతోంది. ఆ సినిమాకి ఆయన రచయితగా పనిచేశారు. ఈ సినిమాలో తెలంగాణ బిడ్డగా నటించడం నా అదృష్టం అన్నారు. ఈ కథ విన్నప్పుడు కొన్నిసార్లు తన కళ్లు చెమర్చాయని, బాధతో హృదయాన్ని కదిలించేలా ఆకట్టుకుంటుందని నటి రోహిణి చెప్పారు.

- October 24, 2024
0
52
Less than a minute
Tags:
You can share this post!
administrator