తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్న హీరోయిన్

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్న హీరోయిన్

టాలీవుడ్‌ హీరోయిన్, ‘సంక్రాంతికి వస్తున్నాం..’ సినిమా ఫేమ్‌ మీనాక్షి చౌదరి కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయానికి చేరుకున్న హీరోయిన్‌కి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల హీరోయిన్‌ని చూసిన భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు వెంటబడ్డారు.

editor

Related Articles