లోక‌ల్ ట్రైన్ కింద పడి చచ్చిపోవాలనిపించింది అన్న హీరోయిన్..

లోక‌ల్ ట్రైన్ కింద పడి చచ్చిపోవాలనిపించింది అన్న హీరోయిన్..

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మృణాల్ సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చారు. సినిమాల్లో అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఒకసారి లోకల్ ట్రైన్ నుండి దూకి చనిపోవాలని అనిపించిందని  చెప్పారు. అయితే తల్లిదండ్రులు గుర్తొచ్చి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆమె చెప్పారు. ప్ర‌స్తుతం మృణాల్ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మృణాల్‌కి చిన్నతనంలోనే నటనపై ఆసక్తి కలగ‌డంతో మొదట సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందింది. ‘కుంకుమ భాగ్య’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది మృణాల్. ఆ తర్వాత హిందీలో ‘సూపర్ 30’, ‘జెర్సీ’ వంటి సినిమాలతో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగు సినిమా ‘సీతారామం’లో నటించి త‌న క్రేజ్ మరింత పెంచుకుంది. ప్రస్తుతం తెలుగులో, హిందీలో కలిపి సుమారు అరడజను సినిమాలు చేస్తోంది.. డెకాయిట్ ఒక్కటే తెలుగులో మృణాల్‌కి ఉన్న ఆఫర్.

editor

Related Articles