ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో హీరోగా ఎదిగిన నాని. సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులకి విభిన్నమైన సినిమాలని అందించాలని ఎప్పుడూ తాపత్రయపడుతుంటారు. ఇక ఇప్పుడు నాని మాస్ హీరోగా ఎదిగేందుకు కృషి చేస్తున్నాడని అనిపిస్తోంది. హిట్ 3, ది ప్యారడైజ్ అనే సినిమాలతో నాని ప్రేక్షకులకి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతున్నట్టు తెలుస్తోంది. నాని నటించిన హిట్ 3 సినిమా మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక నాని హీరోగానే కాకుండా అటు నిర్మాతగానూ సక్సెస్ అవుతున్నారు. చిన్న సినిమాగా విడుదలైన కోర్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాతోనే రామ్ జగదీష్ అనే మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కోర్టు సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా, ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమ్ అవుతుండగా, ఇందులోను మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కోర్టు సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో సినిమా నిర్మాత నాని దర్శకుడికి ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారట. కోర్టు డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశాడు. నాని చేతుల మీదుగా కారు బహుమతిగా తీసుకోవడం పెద్ద అచీవ్‌మెంట్ అని చెప్పిన ఆ దర్శకుడు..
- April 24, 2025
0
67
Less than a minute
Tags:
You can share this post!
editor

