విజయంతమైన సినిమాలతో వరుసగా నటిస్తున్న హీరో శివకార్తికేయన్ (ఎస్‌కే). ‘ది గోట్’ ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాపై దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ, ‘శివకార్తికేయన్ హీరోగా తాను దర్శకత్వం వహించే సినిమా ప్రీ ప్రొడక్షన్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభమతుంది. ఇది వైవిధ్యభరితమైన సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇందులో హీరోను సరికొత్త లుక్‌లో చూస్తారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, నిర్మాణ సంస్థ, సంగీత దర్శకుడు తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు.

- October 14, 2025
0
47
Less than a minute
You can share this post!
editor