ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అద్భుత పోరాట ఘట్టాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసే సినిమాలను ఈ విభాగం క్రింద ఎంపిక చేయనున్నారు. ఈ కేటగిరీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఆస్కార్ కమిటీ.. ‘మిషన్ ఇంపాజిబుల్’ ‘ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాలతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలతో కూడిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 2028లో ఆస్కార్ వందేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకొని ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ కేటగిరీలో తొలి అవార్డును అందించనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో ఆస్కార్ కమిటీ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. ‘వందేళ్ల నిరీక్షణ తర్వాత ఆస్కార్ కమిటీ ‘స్టంట్ డిజైన్’ విభాగంలో అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇదొక చారిత్రాత్మక విజయంగానే చెప్పుకోవాలి.

- April 14, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor