లోకనాయకుడు కమల్‌హాసన్ హీరోగా దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కాంబోలో వస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’. ‘నాయగన్’ (నాయకుడు 1987) తర్వాత దాదాపు 37 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుండడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కమల్‌హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తుండగా.. త్రిష హీరోయిన్గా నటిస్తోంది. శింబు, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్ 05 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా నుండి ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్‌ను వదిలిన టీం తాజాగా తెలుగు ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. జింగుచా అంటూ సాగే ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా.. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
- April 30, 2025
0
76
Less than a minute
Tags:
You can share this post!
editor

