‘భైరవం’ సినిమా అంతా ఆలయం చుట్టూరా…

‘భైరవం’ సినిమా అంతా ఆలయం చుట్టూరా…

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ హీరోలుగా రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భైరవం’. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌కి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. పవిత్ర వారాహి ఆలయం చుట్టూ ఈ కథ నడుస్తుందని ట్రైలర్‌ చెబుతోంది. ఆధ్యాత్మిక విశ్వాసాలు, స్వార్థ రాజకీయ వికృత చేష్టలు, ముగ్గురు స్నేహితుల గొప్ప స్నేహ బంధం, ఆలయాన్ని, దాని వారసత్వాన్నీ రక్షించేందుకు ఆ స్నేహితులు చేసే పోరాటం ఇవన్నీ ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. సినిమాపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ సాగింది. ఈ సినిమాకి మాటలు: సత్యర్షి, తూమ్‌ వెంకట్‌, కెమెరా: హరి కె.వేందాంతం, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సమర్పణ: డా.జయంతిలాల్‌ గడా, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్‌.

editor

Related Articles