పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ పై భారీ అంచనాలే ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ఫుల్ స్టోరీగా రాబోతోంది. ఐతే, ‘స్పిరిట్’ సినిమాలో నటించే అవకాశం ఇవ్వమని సందీప్ రెడ్డి వంగాను అనిల్ రావిపూడి అడిగినట్లు చెప్పారు. అయితే సందీప్ రెడ్డి వంగా మాత్రం అనిల్ రిక్వెస్ట్‌కి నవ్వుతూ ‘మీరు మాకు దొరకరు. సినిమా తర్వాత సినిమా చేస్తావు. యాక్టింగ్ చేసే గ్యాప్ ఇస్తావా?’ అని అన్నారట. ఈ విషయాన్ని కూడా అనిల్ రావిపూడి తెలిపారు. అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా సినిమాల గురించి కూడా కామెంట్స్ చేస్తూ.. ‘నేను సందీప్‌లా సినిమాలు తీయలేను. అదేవిధంగా నాలా సందీప్ రెడ్డి వంగా కూడా సినిమాలు తీయలేడు’ అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే.. సినిమా ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుండి మరో వినూత్న సినిమా రాబోతోందని తెలుస్తోంది.

- January 27, 2025
0
29
Less than a minute
Tags:
You can share this post!
editor