ఆ ముద్దు జీవితాంతం గుర్తుండిపోతుంది: నాగ చైత‌న్య‌

ఆ ముద్దు జీవితాంతం గుర్తుండిపోతుంది: నాగ చైత‌న్య‌

నాగ చైత‌న్య ఈ మ‌ధ్య కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారాడు. పెళ్లిళ్లు, సినిమాల‌తో చైతూ పేరు మారుమ్రోగిపోతోంది. ముందుగా చైతూ ఏ మాయ చేశావే సినిమా స‌మ‌యంలో స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డి ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు మంచిగానే ఉన్న ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు. నాగ చైత‌న్య మ‌రో టాలీవుడ్ న‌టి శోభిత ధూళిపాళ్ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి అన్న‌పూర్ణ స్టూడియోలో అట్ట‌హాసంగా జ‌రిగింది. ఇక ఈ జంట కూడా అడ‌పాద‌డ‌పా త‌ళుక్కున మెరుస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. అయితే నాగ చైత‌న్య‌ని రానా ఇంట‌ర్వ్యూ చేసిన పాత వీడియో ఒక‌టి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇందులో రానా.. చైతూని తొలి ముద్దు అనుభ‌వం గురించి అడ‌గ‌గా, తాను తొమ్మిదో తరగతిలోనే మొదటి ముద్దు ఇచ్చిన విషయాన్ని బయటపెట్టారు. అప్పుడు ఇచ్చిన ఆ ముద్దు నా జీవితమంతా పని చేసింది అంటూ నవ్వుతూ నాగ చైతన్య చెప్పుకు రావ‌డం విశేషం. ఇక స‌మంత, చైతూ విడిపోయాక చైతూ రెండో వివాహం చేసుకున్నా, స‌మంత మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంది.

editor

Related Articles