తెలుగు సినిమాలో డేవిడ్ వార్నర్ యాక్టింగ్..!

తెలుగు సినిమాలో డేవిడ్ వార్నర్ యాక్టింగ్..!

ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు డేవిడ్ వార్నర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న క్రికెట్‌తోనే కాదు త‌న రీల్స్‌తో కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన డేవిడ్ వార్నర్ తరచుగా సోషల్ మీడియాలో తెలుగు హీరోల డైలాగులు చెబుతూ రీల్స్ చేయడం మ‌నం చూశాం. బాహుబలి, పుష్ప, డీజే టిల్లు అంటూ పలువురు టాలీవుడ్ సినిమా హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేశాడు. ఈ క్ర‌మంలో తెలుగు అభిమానులు వార్నర్‌ని డేవిడ్ మామ అని ముద్దుగా పిలుచుకుంటూ వ‌స్తున్నారు. అయితే ఆయ‌న మ‌న తెలుగు సినిమాలో త‌ళుక్కున మెరిసిన బాగుంటుంద‌ని కొంద‌రు త‌మ కోరిక‌ని వెలిబుచ్చారు. అభిమానుల కోరిక నెరవేరింది. ఇప్పుడు డేవిడ్ వార్న‌ర్ తెలుగు సినిమాలో క‌నిపించి సంద‌డి చేయ‌బోతున్నాడు. హీరో నితిన్ నటించిన రాబిన్‌హుడ్‌లో డేవిడ్ కనిపిస్తాడని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగిన దానిని ఎవ‌రూ ఖండించ‌లేదు, నిజంగా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడా ప్రచారాన్ని నిజం చేస్తూ నిర్మాత రవిశంకర్ అభిమానుల‌కి అదిరిపోయే శుభ‌వార్త అందించారు. అలానే ఈ సినిమాలో నితిన్, శ్రీలీల చాలా అందంగా క‌నిపిస్తార‌ని కూడా తెలియ‌జేశారు. నితిన్, శ్రీలీల లాంటి పెయిర్‌ని చూసి ఎన్నో ఏళ్లు అవుతోంది. గ‌తంలో ఇలాంటి పెయిర్‌ని పోకిరి చిత్రంలోనే చూశాను. ఆ సినిమాలో మహేష్‌బాబు, ఇలియానా ఎంత అందంగా కనిపించారో ఇప్పుడు సినిమాలో నితిన్, శ్రీలీల అంతకి మించి అందంగా కనిపిస్తారు అని రవిశంకర్ అన్నారు.

editor

Related Articles