అనసూయ భరధ్వాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తాజాగా అనసూయ తన కొత్త ఇంట్లోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ ఇంట్లో పూజలు చేశారు. ఈ క్రమంలో హనుమాన్ తన ఇంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు అంటూ అనసూయ ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ, అనసూయ ఆ పోస్ట్‌లో ఏం రాసుకొచ్చారు అంటే.. ‘నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఆయననే ఆరాధిస్తాను. మా నాన్న ఎప్పుడూ ఓ విషయం చెప్పేవారు. కష్టాల్లో ఉన్నా, సంతోషంగా ఉన్నా సరే హనుమాన్ అని అనుకోకుండా ఏదీ చేయద్దు అని చెప్పారు’ అంటూ అనసూయ తెలిపింది. అనసూయ తన పోస్ట్‌లో ఇంకా ఇలా రాస్తూ.. ‘ఈ క్రమంలోనే నేను నా కొత్త ఇంటికి సంజీవని అని పేరు పెడదాం అనుకున్నా. హనుమాన్‌ను ఆహ్వానించినట్టు ఉంటుందని. కానీ, గురువు గారు చెప్పడంతో రామ సంజీవని అని పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే రాముడి లేనిచోట హనుమాన్ ఉండడు. ఆ పేరు పెట్టుకున్నందుకు స్వయంగా ఆ హనుమంతుడే మా ఇంటికి వచ్చాడని గురువు గారు ఫొటో చూపించడంతో ఆనందం తట్టుకోలేకపోయా. ఆ హనుమాన్‌ను మా ఇంటికి ఆహ్వానించినట్టు అనిపించింది’ అంటూ అనసూయ రాసుకొచ్చింది.
- May 19, 2025
0
164
Less than a minute
Tags:
You can share this post!
editor

