నీ ఓర్పుకు థ్యాంక్స్.. భార్య‌కి విషెస్ చెప్పిన బ్ర‌హ్మాజీ

నీ ఓర్పుకు థ్యాంక్స్.. భార్య‌కి విషెస్ చెప్పిన బ్ర‌హ్మాజీ

నటుడు బ్ర‌హ్మాజీ టైమింగ్ సెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఆన్‌స్క్రీన్‌లోనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోను తెగ న‌వ్విస్తుంటాడు. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేస్తున్నాడు. త‌న ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విష‌యాలు కూడా షేర్ చేస్తున్నాడు. అయితే బ్ర‌హ్మాజీ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ఫ్యామిలీకి త‌ప్ప‌క కొంత స‌మ‌యం కేటాయిస్తుంటాడు. తన భార్యతో ప్రపంచ దేశాలు తిరగడం తనకు ఇష్టమని బ్రహ్మాజీ చెబుతుంటాడు. తాను సంపాదించిన డబ్బు అంతా కూడబెట్టడం గానీ, ఇన్వెస్ట్ చేయడం వంటిది చేయ‌ను. వాటితో ప్ర‌పంచ‌దేశాలు చుట్టి వ‌స్తాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో అన్నాడు. బ్ర‌హ్మాజీది ప్రేమ పెళ్లి. వారిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ కథ గురించి కూడా బ్రహ్మాజీ ఇదివరకు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అయితే తన భార్యతో కలిసి అన్ని దేశాలు తిరిగి రావడమే తనకు ఇష్టమని బ్రహ్మాజీ అంటుంటాడు. ఈ రోజు బ్రహ్మాజీ వెడ్డింగ్ డే కావ‌డంతో తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ అంటూ స్పెషల్‌గా విషెస్ అందించాడు.

editor

Related Articles