Movie Muzz

తేరే ఇష్క్ మె..’ కలెక్షన్స్ వెనకాల ఏ రహస్యమో… ప్రేక్షకులు షాక్!

తేరే ఇష్క్ మె..’ కలెక్షన్స్ వెనకాల ఏ రహస్యమో… ప్రేక్షకులు షాక్!

వెర్సటైల్ స్టార్ ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మె..’ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం, భూషణ్ కుమార్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 28న విడుదలై మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రిలీజ్‌ అయ్యి 10 రోజులు పూర్తయ్యే లోపే ప్రపంచవ్యాప్తంగా ₹141.86 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. రెండో వారాంతం వచ్చినప్పటికీ సినిమాకు ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా క్లీన్ హిట్‌గా దూసుకెళ్తోంది. ధనుష్–కృతి సనన్ కెమిస్ట్రీ, వారి ఇంటెన్స్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌లు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. రియలిస్టిక్ ఎమోషన్, మంచి మ్యూజిక్, స్టోరీ ప్రెజెంటేషన్ సినిమాకు అదనపు బలం అయ్యాయి. పాజిటివ్ మౌత్‌టాక్‌తో రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్న ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాల్ని ఇష్టపడేవారికి తప్పనిసరిగా చూసేయాల్సిన చిత్రంగా నిలుస్తోంది.

editor

Related Articles