ప్రస్తుతం ‘మిరాయ్ ’ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న హీరో తేజ సజ్జ, తన నటనా ప్రయాణాన్ని బాలనటుడిగా ప్రారంభించిన విషయం తెలిసందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాతో తెరంగేట్రం చేసిన తేజ, ఆ తరువాత ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ వంటి చిత్రాల్లో కూడా బాలనటుడిగా మెరిశాడు. ఈ సినిమాల వల్ల తేజకి చిరంజీవితో మంచి బాండింగ్ ఏర్పడింది. బాల నటుడిగా తేజ ఉన్న సమయంలో ఆయన ప్రతి పుట్టిన రోజుని చిరు సెలబ్రేట్ చేసేవారట. ఈ విషయాన్ని తేజనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చిరంజీవి బర్త్ డే ఆగస్ట్ 22, తేజ బర్త్ డే ఆగస్ట్ 23 కావడంతో చిరు మరిచిపోకుండా తేజను ప్రత్యేకంగా ఆహ్వానించి, కేక్ కట్ చేయించేవారట. అది ఇప్పటికీ నా జీవితంలో ఓ ప్రత్యేక జ్ఞాపకం అని తేజ అన్నారు. అయితే తాజాగా మిరాయ్ ప్రమోషన్ లో భాగంగా తేజ మాట్లాడుతూ.. ఇంద్రలో తనకి అవకాశం రావడం పట్ల స్పందించాడు. కొన్ని వందల ఫొటోల నుండి చిరంజీవి నా ఫొటోను ఎంపిక చేశారు, ఆ సంఘటన నాకు ఆశ్చర్యమనిపించింది. అలా నా జీవితం మారింది అని తేజ సజ్జా స్పష్టం చేశారు.

- September 8, 2025
0
10
Less than a minute
You can share this post!
editor